రాసిపెట్టుకోండి... ఈ ఏడాది చివరలో ఈ రాశులు కోటిరెట్ల ఫలితాన్ని పొందబోతున్నారు
మరో రెండు నెలల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీనిపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆర్థికంగా కలిసివస్తుందని, తమను ఆదుకుంటుందని అందరూ భావిస్తుంటారు. ఇటువంటి తరుణంలోనే జ్యోతిష్యం ప్రకారం నాలుగు కీలక గ్రహాలు నవంబరు నెలలో తమ రాశులను మార్చుకుంటున్నాయి. ఈ ప్రభావం నాలుగు రాశులపై ఉంటుంది. వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలను కల్పించనుంది. సూర్యుడు, గురుడు, బుధుడు, శుక్రుడు, శని తమ స్థానాలను మారుస్తాయి. అయితే మరికొన్ని రాశులకు మాత్రం ప్రతికూల ప్రభావాలుంటాయి. ఏయే రాశులవారికి ఎటువంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం.
బృహస్పతి
ఏడాది మొత్తం వృషభరాశిలో ఉండే బృహస్పతి మృగశిర నక్షత్రాన్ని వదిలిపెట్టి రోహిణీ నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఈ పరిణామం ఈనెల 28వ తేదీన జరుగుతుంది. దీనివల్ల మేషరాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, మిథునరాశివారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. మంచి స్థాయికి చేరుకుంటారు.

బుధుడు
ఈనెల 26వ తేదీన బుధుడు వృశ్చికరాశిలోకి తిరోగమనం చేస్తాడు. ఈ ప్రభావం మీన రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కన్యారాశి, కర్కాటక రాశులకు బాగా కలిసిరానుంది. ఇదే నెల 30వ తేదీన వృశ్చిక రాశిలో అస్తమయం జరుగుతుంది. బుధుడి సంచార ప్రభావం వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, సింహ రాశి, మేషరాశులపై పడుతుంది. ఈ సమయంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
శుక్రుడు
ఈనెల ఏడోతేదీన శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ ప్రభావం మీన రాశి, కుంభరాశి, మకర రాశి, తులారాశి, సింహ రాశి, వృషభరాశి, మేష రాశులకు బాగా కలిసివస్తుంది. అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
సూర్యుడు
ఈనెల 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం మకరం, ధనుస్సు, వృశ్చికం, సింహం, మేష రాశులపై ఉంటుంది. అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మంచి ఫలితాలను పొందుతారు. పెండింగ్ పనులు పూర్తిచేయడంతోపాటు కొత్త పనులను ప్రారంభిస్తారు.
శనిదేవుడు
ఈనెల 15వ తేదీన శనిదేవుడు కుంభరాశిలో ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. చేసిన కర్మలను బట్టి అన్ని రాశులవారికి ఫలితాలను ఇస్తాడు.












Click it and Unblock the Notifications