సెప్టెంబరు 16 వరకు ఈ రాశులను బంగారంలో ముంచెత్తుతున్న సూర్యుడు
సూర్యుడు శనిదేవుడికి 180 డిగ్రీల దూరంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడి కుమారుడిగా భావించే శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. భానుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు 180 డిగ్రీల దూరంలో ఉండటంవల్ల సంసప్తక యోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ ప్రభావం వచ్చేనెల 16వ తేదీ వరకు ఉంటుందని, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సూర్యుడు ఈ దశలో ఉన్నాడని తెలుపుతున్నారు. ఇలాంటి పరిణామం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కుంభ రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలోనే తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సులువుగా ఉపశమనం కలుగుతుంది. మంచి ఆరోగ్యవంతులవుతారు. కొంతకాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో, పెద్దల మద్దతుతో సంపూర్ణంగా పూర్తిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు.

మిథున రాశి
సంసప్తక యోగం ఈ రాశివారికి అదృష్టాన్ని కొనితెస్తుంది. కొత్తగా ఇల్లును కొనుగోలు చేయడంతోపాటు భూములను కూడా కొనుగోలు చేస్తారు. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. వీటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. ఉన్న సంపద బాగా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు.
మేష రాశి
ఈ రాశివారికి ఆదాయం పెరగడంతోపాటు కొత్త ఆదాయ వనరులు కూడా తోడవుతాయి. వ్యాపారాల్లో ఉన్నవారికి ఆదాయ మార్గాలు తోడవుతాయి. వీటిద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తారు. శుభవార్తలను వింటారు. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. వాటినుంచి మంచి ఫలితాలుంటాయి. గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.












Click it and Unblock the Notifications