రేపు లక్ష్మీదేవి ఈ రాశులకు సంపదను పోగేస్తుంది
హిందూ సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం గురుపౌర్ణమి అతి పవిత్రమైన పండగ. సాక్షాత్తూ షిరిడీ సాయిబాబా తన భక్తులతో ఈ పండగ జరుపుకోండి అని స్వయంగా గురుపౌర్ణమి గురించి చెప్పారు. మహాభారతాన్ని రచించిన మహర్షి వేద వ్యాసుడు ఆషాఢ పూర్ణిమ రోజు జన్మించడంతో ప్రతి సంవత్సరం అదేరోజు గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ పండగ ఈ ఏడాది జులై 21వ తేదీ (రేపు) వచ్చింది. ఆరోజు చేసే దానాలు, నదీ స్నానాలు ఎన్నో రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు.. అదేరోజు ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తవడంతోపాటు విజయం దక్కుతుంది.
మానవాళికి మొదటి గురువు వేదవ్యాసుడు. నాలుగు వేదాలను ఆయన మనకు అనుగ్రహించారు. అదేరోజు విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది. దేవ గురువైన బృహస్పతి వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకుడికి తిరుగుండదు. గురు పూర్ణిమ రోజు సర్వార్థ సిద్ధి యోగం, విష్కుంభ యోగం, ప్రీతి యోగం, శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతున్నాయి. అదేరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. వీటి ప్రభావం వల్ల కొన్ని రాశిచక్రాలవారికి ఎంతో అదృష్టం సమకూరుతోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

వృషభ రాశి
ఈ రాశివారు ఆర్థికంగా వృద్ధి చెందడంతోపాటు వ్యాపారానికి సంబంధించి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా గౌరవాన్ని అందుకుంటారు. తల్లిదండ్రుల నుంచి, తోబుట్టువుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
సింహ రాశి
అనుకున్న పనిని పూర్తిచేసి విజయం సాధిస్తారు. పనిచేసేచోట పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతోపాటు వారికి మీ నుంచి అధిక రాబడి వస్తుంది. దీనివల్ల వారు వేతనాన్ని పెంచుతారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి పనులన్నింటినీ పూర్తిచేస్తారు.
కుంభ రాశి
ఈ రాశివరికి గురు పౌర్ణమి ఎంతో ప్రయోజనకరం. ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపుతట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. సంపదను భారీగా పోగేస్తారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు.












Click it and Unblock the Notifications