శశ రాజయోగంతో ఈ రాశులకు అఖండ భోగభాగ్యాలు
జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో ఒకటైన చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఇలా చేసే గ్రహం చంద్రుడు ఒక్కడే. చంద్రుడు ఈరోజు మేషరాశిలోకి సంచరించాడు. దీనివల్ల శక్తివంతమైన శశ రాజయోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారు తమ జీవితంలో ఇప్పటివరకు పొందలేని భోగభోగ్యాలను, ధనయోగాలను ఈ సమయంలో పొందబోతున్నారు. ఆస్తులు కలిసి రావడంతోపాటు అదృష్టం తోడుంటుంది. కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.
మిథునరాశి
కెరీర్ పరంగా కొన్నాళ్ల నుంచి ఎదురవుతున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. భవిష్యత్తుపై చక్కటి అవగాహన ఉంటుంది. ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు తోడవుతాయి. విదేశీయులతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది.

సింహరాశి
ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందుతారు. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుంటుంది. అఖండ విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగాలు చేసుకునేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. విహార యాత్రలకు వెళతారు. వ్యాపారస్తుల సంపాదనలో మార్పు చోటుచేసుకుంటుంది.
వృశ్చిక రాశి
వీరికి అదృష్టం తోడుంటుంది. జీవితంలో ఎప్పటినుంచో అనుకుంటున్న పనులను పూర్తిచేయగలుగుతారు. సంపాదన బాగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో సంతోషంగా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగుపడుతుంది. ఒత్తిడి నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications