ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
వచ్చే నెల ఐదోతేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ కాలంలో ప్రజలంతా శివుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేవుడిని పూజించినప్పటికీ అందరి ఆరాధన ఒక్కడే అయిన భగవంతుడికి చేరుతుంది. మాసాలన్నింటిలో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం. అందులోను శ్రావణ సోమవారం ఇంకా విశిష్టమైనది. ఇది చాలా పవిత్రమైనదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. పరమ శివుడి అనుగ్రహంతో కొంతమంది అదృష్టవంతులకు ఎంతో ప్రత్యేకంగా శ్రావణం నిలుస్తోందని చెబుతున్నారు. ఏ రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
శ్రావణ మాసం మొత్తం ఈ రాశివారికి ఎంతో శుభం చేకూరుస్తుంది. అదృష్టం తోడుండటంతోపాటు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం దక్కుతుంది. శ్రమతో తమ ప్రగతికి బాటలు వేసుకుంటారు. శివలింగానికి పాలాభిషేకం చేయడంవల్ల ఈ రాశివారికి మరింత కలిసివస్తుంది. అలాగే గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ మాసంలో పూర్తిచేసి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు.

మకర రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వేరేవారి వద్ద చిక్కుకుపోయిన ధనం ఈ మాసంలో దరికి చేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. లక్ష్మీదేవి, పరమేశ్వరుడి అనుగ్రహంతో వైవాహిక జీవితంలో ఉన్నవారికి జీవితం ఆనందంగా, సంతోషంగా గడుస్తుంది. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే బాగా కలిసివస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు.
కుంభ రాశి
శ్రావణ మాసం మొత్తం ఈ రాశివారికి సంతోషాన్ని కలగజేస్తుంది. పరమేశ్వరుడు, లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరి కోరికలన్నీ నెరవేరడంతోపాటు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఉద్యోగంలో పురోగతి లభించడంతోపాటు సీనియర్ ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభించడంతోపాటు పనితీరుపై ప్రశంసలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. పరమేశ్వరుడికి అభిషేకం చేయడంవల్ల సంపూర్ణంగా కలిసివస్తుంది. అన్ని పనులకు అదృష్టం తోడుంటుంది.












Click it and Unblock the Notifications