ఈనెల 16న రెండు శుభయోగాలు.. ధనవంతులవుతున్న రాశులు

ఇటీవలే చైత్ర నవరాత్రులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగు కొత్త సంవత్సరంలో చైత్రమాసంలో జరుపుకుంటారు. అందుకే వీటిని చైత్ర నవరాత్రులు అంటారు. ఇంగ్లిషు క్యాలెండర్ ప్రకారం మార్చి-ఏప్రిల్ నెలల్లో ఇవి వస్తాయి. వీటిల్లో అష్టమి తిథి ఎంతో ముఖ్యమైనది.

ఆరోజు గౌరీదేవిని పూజిస్తారు. తమ ఇళ్లల్లో అందరూ కులదేవతను పూజిస్తారు. మరో ఐదురోజుల్లో 16వ తేదీన దుర్గాష్టమి రాబోతోంది. ఆరోజు రెండు శుభకర యోగాలు ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి, రవి యోగం. దీనివల్ల దుర్గాదేవి కటాక్షాన్ని ఏయేరాశులవారు పొందుతారో తెలుసుకుందాం.

these zodiacs signs very lucky due to Durga Ashtami 2024 in chaitra navaratri

కన్యారాశి
ఈ రాశివారు ఊహించనిరీతిలో ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు లేదంటే ఆధ్యాత్మిక పరమైన యాత్రకు వెళతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కెరీర్ లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అదృష్టం తోడుండటంవల్ల ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. కోరికలన్నీ నెరవేరతాయి.

వృషభం
ఈ రాశివారికి దుర్గామాత కరుణ లభిస్తుంది. ఒకరకంగా వీరిపై ఆ తల్లి డబ్బు వర్షం కురిపిస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు మొదలవుతాయి. పిల్లలు లేనివారికి సంతాన యోగం ఉంది. దైవభక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రతి పనిలోను అదృష్టం తోడుండటంవల్ల పనులన్నింటినీ విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.

కర్కాటకం
ఈ రాశివారికి దుర్గాదేవి అనుగ్రహం ఉంది. కెరీర్ లో మంచి స్థాయికి చేరుకుంటారు. ఎప్పటినుంచో వేచిచూస్తున్న ఉద్యోగం చేతికి అందుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరగడంతోపాటు ఆర్థికంగా స్థిరపడతారు. మీ మనసుకు దగ్గరైన వ్యక్తులను కలుస్తారు. అన్ని పనుల్లోను అదృష్టం కలిసివస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+