కేతువు సంచారంతో ఈ రాశులకు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
అశుభ గ్రహమైన కేతువు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తోంది. వచ్చే ఏడాది మే నెలలో సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. అదే ఏడాది తిరోగమనం కూడా చేస్తుంది. దీనివల్ల కొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనస్సు రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు లభించి ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంటారు. వృత్తుల్లో ఉన్నవారికి జీవితంలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం అవి తొలగిపోతాయి. కష్టపడి పనిచేయడంవల్ల మంచి లాభాలున్నాయి. ఎంత శ్రమపడితే అంత లాభాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుండటంతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే భౌతిక సుఖాలు కూడా కలుగుతాయి. భార్య తరఫున, ఆమె తల్లిదండ్రుల తరఫున డబ్బులు వస్తాయి.

మిథున రాశి
అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఈ సమయం కొంత ఊరట కలిగిస్తుంది. ఆధ్యాత్మిక యత్రలు చేస్తూ కొన్ని దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సోదరుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట పై అధికారుల నుంచి మద్దతు లభించి పదోన్నతి పొందుతారు. గతం నుంచి వేధిస్తున్న అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయికానీ పూర్తిగా తగ్గవు.
మీనరాశి
కేతువు సంచారం వీరికి అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. ఎటువంటి పని తలపెట్టినా విజయం దక్కుతుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. కొన్ని పనులకు సంబంధించి ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. లేదంటే తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. అనారోగ్యం నుంచి విముక్తి కలగడంతో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తుంటారు. కెరీర్ కు సంబంధించి ఈసారి మంచి విజయాలను సాధిస్తారు.












Click it and Unblock the Notifications