గురుడి సంచారం.. ఆదాయం రెట్టింపు
వచ్చే ఏడాది మే 1వ తేదీ నుంచి గురుడు వృషభరాశిలోకి సంచరించనున్నాడు. దీని ప్రభావం మొత్తం మూడు రాశులవారిపై ఉంటుంది. కొందరికి అనుకూల ప్రభావాలు కలిగితే మరికొందరికి ప్రతికూల ప్రభావాలుంటాయి. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
మేష రాశి : మేష రాశి వారికి గురు గ్రహ సంచారం ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుంది. అదృష్టం రెట్టింపవుతుంది. ఆర్థిక సమస్యలున్నవారికి ఉపశమనం లభిస్తుంది. బృహస్పతి వల్ల బ్యాంకు బ్యాలెన్స్ లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. కొంతకాలం నుంచి శుభకార్యాల కోసమే ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం తథ్యం.

కర్కాటక రాశి : రాబోయే 12 నెలలపాటు వీరికి ఆర్థికంగా ప్రయోజనం కలగనుంది. గురువు అనుగ్రహంతో అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు వేతనం పెరుగుతుంది. ఆర్థికంగా మార్పు చేర్పులు చోటుచేసుకుంటాయి. ఆదాయం రెట్టింపవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది లాభదాయకమైన సమయంగా చెప్పొచ్చు.
సింహరాశి : ఎటువంటి పనుల్లోనైనా సులువుగా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ తిరిగి ఇప్పుడు ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications