శ్రీరామ నవమిరోజు ఈ పనులు చేయండి.. బాగా కలిసివస్తుంది!
శ్రీరామ నవమి రోజు కొన్ని సులువైన చర్యలతో మన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారం. సకల కళా గుణాభిరాముడైన శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12.00 గంటలకు త్రేతాయుగంలో మిట్ట మధ్యాహ్నం జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. నవమి తిథి మార్చి 29వ తేదీ రాత్రి 9.07 గంటలకు ప్రారంభమై 30వ తేదీ రాత్రి 11.30 గంటలకు ముగుస్తుంది. నవమి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం.
శ్రీ రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాములవారి ఆలయాల్లో శ్రీరాముడిని పూజించి, రామజన్మోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్నిచోట్ల శోభా యాత్రను నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా కొన్ని పనులు చేసి మన జీవితాన్ని సంతోషంగా మార్చకునేది ఎలాగో తెలుసుకుందాం. ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడు లోకానికంతటికీ ఆదర్శనీయుడు. సరైన మార్గంలో పూజలు నిర్వహిస్తే బాగా కలిసివస్తుంది. సీతారాముల కల్యాణం అదే రోజు జరుగుతుంది. స్వామివారి కల్యాణాన్ని తిలకించి, అక్షింతలు తలమీద వేసుకున్నా కలిసివస్తుంది.

నవమి రోజు శ్రీరామ రక్షా స్తోత్రం పఠించాలి. రాములవారి చిత్రానికి గంధంతో బొట్లు పెట్టి అలంకరించాలి. అలాగే నవమి రోజు కల్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి. పానకాన్ని శ్రీరాముడికి నివేదించిన తర్వాతే కుటుంబ సభ్యులంతా తీసుకోవాలి. కల్యాణం సమయంలో తలంబ్రాలు పోయడం చూసినవారికి ఏడాది పొడవునా ఆహారానికి లోటు ఉండదు. రామనామం జపిస్తుండాలి. తులసి దళంతో రాములవారిని, మారేడుతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతుణ్ని పూజించాలి. దీనివల్ల విశేష లాభాలు కలుగుతాయి. నవమి రోజు వడపప్పు తయారు చేసి రాములవారికి నివేదించడంతోపాటు రామాయణ గాథను చదువుకోవాలి. ఆ ఒక్కరోజైనా భార్యాభర్తలు తగువులాడుకోకుండా ఉండాలి. సీతారాములు ఆదర్శ దంపతులు. కల్యాణ తలంబ్రాలు భద్రంగా దాచుకుంటారు. పెళ్లి సమయంలో తలంబ్రాల్లో సీతారాముల తలంబ్రాలు కలిపితే వారి దాంపత్యానికి ఎటువంటి లోటు ఉండదు.
రాముడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి సంబరాలు జరుపుకుంటారు. ఉపవాసం ఉండటం శుభప్రదమని, దీనివల్ల సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని, చేసిన పాపాలన్నీ పోతాయనే నమ్మకం ఉంది. నవమి రోజు నిద్రలేచిన వెంటనే దేవుడికి దండం పెట్టుకోవాలి. మనకు ఉన్నంతలో ఆరోజు నిరుపేదలకు దానం చేయాలి. హనుమాన్ చాలీసాను చదవాలి. మధ్యాహ్నం పూజ చేయడం మంచి ప్రయోజనంగా చెబుతున్నారు. అర్చనలు, ప్రత్యేక పూజలు కూడా చేయించుకోవచ్చు. దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి. ఏవైనా సమస్యలు ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తే తొలగిపోతాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications