• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూలై 23న తొలి ఏకాదశి: ఏమిటిది, ఇలా ఉండాలా? సైంటిస్ట్‌ల నిర్ధారణ!

By Srinivas
|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151

జ్ఞాననిధి, జ్యోతిష అభిజ్ఞ, జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ. జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్", ఎం.ఏ తెలుగు (ఏల్), ఎం. ఏ సంస్కృతం, ఎం.ఏ యోగా,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ, ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం),

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు, మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష, జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హిందువులు ఏకాదశి రోజును శ్రేష్టంగా పరిగణించి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు భగవాణుని పూజిస్తారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి ఇటు దైవీకంగా పుణ్యఫలం దక్కుతుంది.శాస్త్రీయంగా చూస్తే మంచి ఆరోగ్య సూత్రం. ఇటివలే విదేశి సైంటిస్టులు కూడ నిర్ధారించి చెప్పారు. ఏకాదశి ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడి రోగాలు రాకుండా కాపాడుతూ,శారీరక పుష్టిని ఇస్తుంది అని ఇటివలి కాలంలో వార్తలు చూడడం జరిగింది.

ఈ ఏకాదశి ఉపవాసం ఏలా చేయాలి అంటే దశమి రోజు రాత్రి వండిన వంటకాలను ఏమి తినకుండా పండ్లు, జ్యూస్ లాంటివి తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి. ద్వాదశి నాడు ఉదయన అన్నం వండి దేవునికి నివేదన చూపించి తినాలి ఇలా ఉపవాసం చేసే శారీరకశక్తి లేని వారు అంటే పిల్లలు,గర్భిణులు,వృద్ధులు,ఆనారోగ్యంతో ఉన్నవారు ప్రతీ రెండు గంటలకు ఒక సారి ఏదో ఒక పండ్ల రసం తీసుకుంటు ఉపవాసం చేయాలి.

దైవంనకు నిక్కచ్చుగా చేయకపోతే పాపం తగులుతుంది,మంచిది కాదు అనే అజ్ఞానంతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు.శారీరక పుష్టి ఉన్నవాల్లు కటువైన ఉపవాసం చేస్తారు,వీలు కాని వారలు మనస్సుతో దండం పెట్టుకోండి చాలు.ఉపవాసం చేసేవారు ద్రవ రూపమైన కొబ్బరి నీళ్ళు,జ్యూస్,మంచి నీళ్ళను తీసుకుంటే తప్పులేదు.

Tholi Ekadashi 2018 Date: About Tholi Ekadasi

ముఖ్యంగా కొంత మంది కొన్ని ప్రాంతల వారు ఈ ఏకాదశి వచ్చిందంటే మాంసహారాన్ని,మత్తు పానీయాలను సేవిస్తారు.ఈ తొలి ఏకాదశి అంటేనే తిని తాగే పండగ అనుకునే వారు కొందరుంటారు. పాపం వారికి తెలువక పొరపాటు చేస్తుంటారు.వాస్తవానికి ఉపవాసం లేకున్న శాకహార భోజనం చేయాలి.అస్సలు మధు మాంసాల జోలికి పోకూడదు.భక్తి శ్రద్ధలతో గడిపి దేవాలయ దర్షణం చేయాలి.

తొలి ఏకాదశి

అన్ని ఏకాదశులలో కెల్ల ఉత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది.విష్ణు భగవానుడు అలంకార ప్రియుడు.మహా విష్ణువునకు పూలతో అలంకరణ చేసి విష్ణు సహస్ర నామ పారాయనం చేస్తూ విష్ణువును పూజించే రోజే ఈ ఏకాదశి తొలి ఏకాదశి.

ఆషాఢమాసలో వచ్చే ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ రోజు పాలసముద్రంలో విష్ణువు యోగనిద్రలోకి వెలతాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని అంటారు.యోగ నిద్రకు సిద్ధమైన దేవుని కోసం భక్తులు ఉపవాసం చేస్తారు.అందుకే నిర్జల ఏకాదశి,శయన ఏకాదశి పిలుస్తారు.ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. శయనైకాదశి ఉపవాస వివరాలను భవిష్యోత్తర పురాణంలో వివరింపబడింది.

ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.

శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు.

ఉపవాసం చేసి శ్రీ హరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు.ప్రతి వైష్ణ దేవాలయంలోను స్వామికి పవళింపు సేవాఉత్సవం జరుపుతారు.

సర్వ దేవతా నివాస స్థానమైన గోవును కూడా ఈ ఏకాదశి రోజు పూజిస్తారు. అధర్వణవేదం, బ్రహ్మాండ, పద్మపురాణం,మహాభారతం కూడా గో విశిష్టత తెలుపుతాయి.గోశాలలను శుభ్రం చేసి ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు.

మహా విష్ణువునకు అత్యంత ఇష్టమైన తులసి కోట దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి పలురకాల పండ్లను నివేదిన చేస్తారు.

ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశి వ్రతం చేసేవారిపై ఎల్లప్పుడు మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.

మహా విష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశయ్యపైన పవళిస్తాడని ఋషులు,యోగులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని గడుపుతుంటారు.

దేశ సంచారులైన యతులు ఈ నాలుగు నెలలు ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు.

ఏకాదశి ఉపవాసవ్రతం చేసుకున్నవారికి అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shukla Paksha ( Waxing Phase of Moon) Ekadasi in the month of Ashada is known as Tholi Ekadashi or Dev Shayani Ekadashi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more