తులసి చెట్టు దగ్గర ఏం పెట్టకూడదో వాస్తు శాస్త్రం చెబుతోంది

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన స్థానం ఉన్న ఆధ్యాత్మిక సంపద 'తులసి'. సనాతన ధర్మంలో తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా, సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకే గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి ఇంటి ముంగిటా తులసి కోట దర్శనమిస్తుంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేస్తూ, నీరు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

ఏ ఇంట్లో అయితే తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో, అక్కడ సానుకూల శక్తి పెరిగి.. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని గట్టి నమ్మకం. అయితే, కేవలం తులసి మొక్కను ఇంట్లో నాటడమే కాదు, దాన్ని ఏ దిశలో ఉంచుతున్నాం? దాని పరిసరాల్లో ఎలాంటి వస్తువులు పెడుతున్నాం? అనేది వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత కీలకం. వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.

Vastu Shastra According to the principles what should not be placed near the Tulasi plant

తులసిని ఏ దిశలో ఉంచాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి మొక్కను సరైన దిశలో ఉంచినప్పుడే ఆ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది.
ఇంటి ఈశాన్య దిశను ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా భావిస్తారు.
కాబట్టి ఈ మూలలో తులసిని ఉంచడం వల్ల
ఇంట్లోకి సానుకూల శక్తులు వేగంగా ప్రవేశిస్తాయి.
ఒకవేళ ఈశాన్యం కుదరకపోతే ఉత్తర లేదా తూర్పు దిశలలో తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ దిశలు కుటుంబ సభ్యుల కెరీర్ ఎదుగుదలకు,
వ్యాపార అభివృద్ధికి ఉన్న ఆటంకాలను తొలగిస్తాయి.

తులసి కోట వద్ద అస్సలు పెట్టకూడని వస్తువులు

పవిత్రతకు నిలయమైన తులసి కోట చుట్టుపక్కల కొన్ని వస్తువులను ఉంచడం వల్ల తీవ్రమైన వాస్తు దోషాలు కలుగుతాయి.
చాలామంది ఇంటి గుమ్మం దగ్గర తులసి కోటను ఉంచి,
దాని పక్కనే చెప్పుల స్టాండ్ పెడుతుంటారు.
ఇది చాలా పెద్ద తప్పు.
లక్ష్మీ స్వరూపమైన తులసి చెంత పాదరక్షలు
ఉంచితే దరిద్రం చుట్టుముడుతుంది.
తులసి మొక్క పరిసరాల్లో మురికి అస్సలు ఉండకూడదు.
పక్కనే చెత్తబుట్టను ఉంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగి,
అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
చీపురు ఇల్లు తుడవడానికి ఉపయోగపడినా,
దాన్ని తులసి కోటకు ఆనించి ఉంచడం లేదా
దానికి దగ్గరగా పెట్టడం అశుభ సూచకం.
ఇది ఇంటి ఆర్థిక శ్రేయస్సును దెబ్బతీస్తుంది.
స్థలం లేదని పాత కుండీలు, పగిలిన సామాన్లు తులసి పక్కన పడేయకూడదు.
అలాగే కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను తులసి పక్కన పెంచితే
కుటుంబ సభ్యుల మధ్య మానసిక ఒత్తిడి, కలహాలు పెరుగుతాయి.

పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

తులసి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలంటే
నిత్య పూజలతో పాటు సాంప్రదాయ నియమాలను కూడా గుర్తుంచుకోవాలి
ప్రతిరోజూ తులసికి నీరు పోయడం మంచిదే అయినా..
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఆదివారాలు, ఏకాదశి తిథుల్లో
తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు.
ఆ రోజుల్లో మొక్కను తాకకుండా కేవలం దీపారాధన మాత్రమే చేయాలి.
తులసి మొక్క నుంచి రాలిపోయిన లేదా ఎండిపోయిన ఆకులను
కాళ్లతో తొక్కేలా చెత్తలో వేయకూడదు.
వాటిని సేకరించి ఏదైనా నదిలో లేదా చెట్ల మొదట్లో వేయడం
లేదా శుభ్రమైన ప్రదేశంలో భద్రపరచడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+