Vijay: లుక్ మార్చిన విజయ్-సీఎం అయ్యాక తొలిసారి ఇలా..!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (Vijay)తొలిసారి వస్త్రధారణ మార్చారు. తమిళనాడు రాజకీయాల్లో సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచె కట్టును కాదని బ్లేజర్ సూట్ లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి హాజరైన విజయ్.. ఆ తర్వాత కూడా అదే స్టైల్ కొనసాగిస్తున్నారు. కానీ ఇవాళ ఉన్నట్లుండి విజయ్ తన వస్త్రధారణ మార్చేశారు. ఇన్నాళ్లుగా వేసుకుంటున్న బ్లేజర్ సూట్ స్ధానంలో తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచెకట్టుకు వచ్చేశారు. దీంతో విజయ్ కొత్తగా కనిపిస్తున్నారు.
సీఎం విజయ్ ఇవాళ రాష్ట్రంలోని పలువురు ఉన్నతాధికారుల్ని కలుసుకున్నారు. వీరిలో కొత్తగా నియామకాలు పొందిన వారు కూడా ఉన్నారు. వీరితో కలిసి విజయ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో తమిళనాడు సంప్రదాయ పంచె కట్టులో కనిపించారు. ఎప్పుడూ బ్లేజర్ లో కనిపించే విజయ్.. ఇలా పంచె కట్టులో కనిపించే సరికి అధికారులు కూడా కొత్తగా చూస్తున్నట్లు ఇందులో కనిపించింది. అయితే విజయ్ మాత్రం ఎప్పటిలాగే తన చిరునవ్వుతో కనిపించారు.

மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு.ச. ஜோசப் விஜய் அவர்களை இன்று (29.05.2026) தலைமைச் செயலகத்தில், மகேந்திரா & மகேந்திரா நிறுவனத்தின் தலைவர் (Automotive Business)
— CMOTamilNadu (@CMOTamilnadu) May 29, 2026
திரு. வேலுசாமி அவர்கள் சந்தித்துப் பேசினார்.#CMJosephVijay pic.twitter.com/W6spQZTwop
తమిళనాడులో దశాబ్దాలుగా రాజకీయ నేతలు ఇలా పంచె కట్టులోనే కనిపిస్తుంటారు. చట్టసభలకు వెళ్లినా, పార్లమెంట్ కు వెళ్లినా, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న పంచె ధరిస్తుంటారు. ఉత్తరాది రాజకీయ నేతలు వీరిపై సెటైర్లు వేసినా ఎప్పుడూ పట్టించుకోరు. గతంలో తమిళనాడును ఏలిన ప్రతీ ముఖ్యమంత్రి ఇలా సంప్రదాయ పంచె కట్టునే కొనసాగించారు. విజయ్ కూడా తన సీఎం ప్రమాణస్వీకారంలో అలాగే కనిపిస్తారని భావించినా బ్లేజర్ సూట్ తో వచ్చి ఆశ్చర్య పరిచారు. ఇప్పుడు మళ్లీ ఆయన పంచె కట్టుకు మారడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.














Click it and Unblock the Notifications