డిసెంబరు 2వ తేదీలోకా ఈ రాశులవారు ధనవంతులవుతున్నారు
సూర్యుడు గ్రహాలకు అధిపతి. ప్రతి 30 రోజులకు ఒకసారి రాశి సంచారం చేస్తుంటాడు. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశిచక్ర గుర్తులకు మంచి ఫలితాలను కల్పిస్తాడు. ఈనెల 19వ తేదీన సూర్యభగవానుడు విశాఖ నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావం డిసెంబరు రెండో తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలన తెలుసుకుందాం.
మకర రాశి
ఈ రాశివారికి బహుమతులు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగులకు అదృష్టం కలిసివచ్చు మంచి స్థాయికి చేరుకుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఇకనుంచి వేధించవు. గతంలో అనుకున్న, ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. మంచి నిర్ణయాలు తీసుకొని వ్యాపారస్తులు మంచి విజయాలను సాధిస్తారు. భారీ లాభార్జన ఉంది. సూర్యుడి అనుగ్రహం వల్ల వీరి కోరికలు కూడా నెరవేరతాయి.

మిథున రాశి
ఆదాయం భారీగా పెరుగుతుంది. అదృష్టం కలిసివచ్చు అందలం ఎక్కుతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనుకోకుండా సంపాదన కూడా ఊహించనిరీతిలో పెరుగుతుంది. భగవంతుడిని ఎంత భక్తితో, నిర్మలమైన మనసుతో మీరు పూజిస్తారనేదానిపై మీకు వచ్చే ఫలితాలు ఆధారపడివుంటాయి.
సంపాదనతో నలుగురికి సాయపడే పనులు చేస్తుంటారు. సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు.
తులారాశి
వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసివస్తుంది. అనుకున్న పనుల్లో చాలా సులువుగా విజయాలను అందుకుంటారు. మంచి పేరు తెచ్చుకుంటారు. సంతోషంగా జీవిస్తారు. ఈ సమయం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications