ఈ రాశులు పట్టిందల్లా బంగారం కాబోతోంది.. ఎప్పటి నుంచంటే?

రాహువు, కేతువు.. రెండూ నీడగ్రహాలని పేరు. ఈ రెండు గ్రహాల పేర్లు చెబితే అందరూ భయపడతారు. కానీ అవి కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తాయనే విషయాన్ని తెలుసుకోరు. ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి ఈ రెండు గ్రహాలు 18 నెలల సమయం తీసుకుంటాయి. కేతువు ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. ఈ ఏడాది మేలో తన రాశిని మార్చుకుంటున్నాడు. సింహరాశిలోకి సంచారం చేస్తాడు. దీని ప్రభావం మొత్తం ద్వాదశ రాశులపై ఉంటుంది. అయితే మూడు రాశులపై మాత్రం అధిక ప్రభావం ఉంటుంది. వారికి అన్నివిధాలుగా కలిసివస్తుంది.

మీన రాశి
కేతువు ఈ రాశికి చెందిన ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావడంతోపాటు మంచి వేతనం దక్కుతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని కేతువు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం వీరికి చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. మాటతీరు విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీవితం మొత్తం తల్లకిందులయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఆస్తికి సంబంధించిన గొడవలన్నీ తొలగిపోతాయి. పనితీరుపై అందరి నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్యం మాత్రం అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

three zodiac signs business will bring good profits due to ketu will enter leo in may month

తులారాశి
ఈ రాశివారికి కూడా ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త పనికిరాదు. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. వారినుంచి సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం.. రెండూ సంతోషంగా గడుపుతారు.చిరకాలంగా మీరు కంటున్న కల నెరవేరుతుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంది. వీరి వ్యాపారం మంచి పురోగతి సాధిస్తుంది. దీనిద్వారా బ్యాంకులో డబ్బు పెరుగుతుంది.

మిథున రాశి
ఈ రాశి మూడో ఇంట్లో కేతువు సంచారం చేస్తున్నాడు. వీరికి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ రాశివారు కూడా జాగ్రత్త పడక తప్పదు. అన్ని రంగాల్లోను విజయం ఉంది. కష్టపడాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి అందరూ సంతోషంగా ఉంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+