ఈనెల 11న నక్క తోక తొక్కిన రాశులు.. 2025 వరకు తిరుగులేదు
ప్రతి సంవత్సరం ప్రతి నెలలో ఏకాదశి వస్తుంటుంది. ఆరోజు శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. శ్రీ షిరిడీ సాయిబాబాకు ఏకాదశి అంటే ఎంతో ఇష్టం. అలాగే తన భక్తులచేత విష్ణు సహస్రనామ పారాయణం చేయిస్తుంటారు. ప్రతి ఏడాది కార్తీక మాసం తర్వాత వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజును మోక్ష ఏకాదశి అంటారు. ఆరోజు మోక్ష ఏకాదశి వ్రతం ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆరోజు ప్రత్యేకంగా ఐదు యోగాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం డిసెంబరు 11వ తేదీన మోక్ష ఏకాదశి వచ్చింది ఆరోజు నుంచి కొన్ని రాశులవారు ఆర్థికంగా విపరీతమైన ప్రయోజనాలను పొందుతున్నారు వారి వివరాలను తెలుసుకుందాం.
మేషం
వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభం పొందుతారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా పొదుపు చేయాలి. భవిష్యత్తులో రాబడులు వచ్చేలా చూసుకోవాలి.

ధనుస్సు
పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. పెళ్లయినవారు ఉపవాసం ఉంటే మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు వారి కార్యాలయాల్లో గౌరవాన్ని పొందుతారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశులకు చెందిన వ్యక్తులు వారి వారి కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృశ్చికం
వీరి కోరికలన్నీ నెరవేరతాయి. ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో ప్రమోషన్ ఉంది. దీంతోపాటు వేతనం కూడా పెరుగుతుంది. వీరికి విష్ణువు నుంచి సంపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయి. కార్యాలయాల్లో ఇతర ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. పనితీరుతో మంచి పేరు సంపాదించుకుంటారు.
విష్ణుమూర్తి నుంచి సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి.












Click it and Unblock the Notifications