ఏప్రిల్ 1 నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
సంపదకు, విలాస జీవితానికి, అందానికి, ఐశ్వర్యానికి కారకుడయ్యే శుక్రుడు ఏప్రిల్ 1వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దేవతల గురువైన బృహస్పతి పూర్వాభాద్రకు అధిపతి. తిరిగి ఏప్రిల్ 12వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోవడంతోపాటు అదృష్టం తోడుండి అన్ని పనులు పూర్తిచేస్తారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాలపైకి మళ్లిస్తారు. డబ్బును ఆర్జించేందుకు అనేక మార్గాలు అందుబాటులోకి వస్తాయి. కుటుంబం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు దొరుకుతుంది. కొన్ని కొన్ని అశుభ వార్తలను వినాల్సి ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులతోపాటు పూర్వీకుల నుంచి, తల్లిదండ్రులవైపు నుంచి, అత్తమామలవైపు నుంచి కూడా.. ఇలా ఏదో ఒక మార్గంలో డబ్బు రావడం మాత్రం ఖాయం. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని, గురుడిని పూజించాలి.

తులా రాశి
వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక చింతనవైపు ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. పనిచేస్తున్న ప్రాంతంలో మీ పనితీరుకు పై అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని, బృహస్పతిని పూజించాలి.
మేష రాశి
గతంలో ప్రారంభమైనప్పటికీ పూర్తవకుండా నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. అదృష్టం వల్ల తిరుగులేని స్థాయిని పొందుతారు. కుటుంబంలో సంతోసం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. సంపదను సృష్టించి సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ సంపదను శ్రేయస్సుకు ఉపయోగించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బృహస్పతిని, శుక్రుడిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు.












Click it and Unblock the Notifications