ఉగాదికి ముందే మిలియనీర్లవుతున్న రాశులు వీరే

చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంటాడు. అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం ఇదొక్కటే. దీనితర్వాత రాహువు, కేతువు 18 నెలల సమయం తీసుకుంటారు. ఈనెల 29వ తేదీన శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆయనకు నాలుగు పాదాలుంటాయి.

బంగారం, వెండి, రాగి, ఇనుము. వీటిల్లో వెండి పాదాలు అత్యంత పవిత్రమైనవి. మీనరాశిలోకి ప్రవేశించే సమయంలో కూడా వెండి పాదాలతో ప్రవేశించబోతున్నాడు. చంద్రుడి నుంచి 2, 5, 9 ఇళ్లల్లో శని ఉంటే అప్పుడు ఆయనకు వెండి పాదం ఉంటుంది. దీనివల్ల మూడు రాశులవారికి అద్భుతంగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

three zodiac signs will become millionaires before telugu new year due to Saturn Wandering in Pisces with silver feet

వృశ్చిక రాశి
ఈ రాశివారు అతి పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు. సొంతంగా వాహనాన్ని కొనుగోలు చేయడంతోపాటు పదిమందికి సహాయం చేస్తారు. కెరీర్ పరంగా మంచిస్థాయికి చేరుకుంటారు. కొన్నాళ్ల నుంచి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఇరువైపులా పెద్దల అంగీకారంతో పెళ్లి కుదురుతుంది. కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు.

కుంభ రాశి
జీవితంలో ఎన్నడూ చూడని సంపదను చూస్తారు. అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. శనిదేవుడు వెండి పాదాలతో సంచరించడంవల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యవంతులవుతారు. ఇష్టమైనచోట పనిచేసే అవకాశం దొరుకుతుంది. అదృష్టం కలిసిరావడంతో మంచి డబ్బును సంపాదిస్తారు. మంచి పేరుతోపాటు సంపదను కూడా అందుకుంటారు.

కర్కాటక రాశి
ఈ రాశివారికి అన్నీ మంచిరోజులే ప్రారంభం కాబోతున్నాయి. కుటుంబ జీవితంలో అత్యంత సమతుల్యతను పాటించి అందరి అభిమానానికి పాత్రులవుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించి శెభాష్ అనిపించుకుంటారు. ఇంటిని లేదంటే కారును కొనాలనుకుంటున్న మీ కోరిక నెరవేరుతుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల ఆర్థికంగా మంచి లాభాలను అందుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+