62 ఏళ్ల తర్వాత రేపు పారిజాత యోగం.. ఈ రాశులకు అఖండ సంపద యోగం
పారిజాత యోగం అనేది జాతకంలో ఏర్పడే శుభప్రదమైన యోగం. ఇది వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని, సంపదను, ఆధ్యాత్మిక ఎదుగుదలకు కారణమవుతుంది. ఏప్రిల్ 19వ తేదీన ఏర్పడబోతున్న ఈ పారిజాత యోగం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన యోగం. జాతకంలో ఇది ఉన్నవారు సంపదను దండిగా పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సవాళ్లను అధిగమిస్తారు. ఏయే రాశులకు పారిజాత యోగంవల్ల బాగా కలిసివస్తుంది? ఆర్థికంగా ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
తులారాశి
అబ్బాయిలకు నచ్చిన అమ్మాయిలతో పెళ్లి కుదురుతుంది. స్థిరాస్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు. స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జ్ఞానాన్ని ఆర్జిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాగా ఆలోచించి తీసుకుంటారు. అవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. మనశ్శాంతిగా జీవిస్తారు. మీ తెలివితేటలు ఇతరులకు నిర్ణయాత్మక శక్తిగా మారతాయి.

కన్యారాశి
ఈ రాశివారు విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇవన్నీ లాభసాటిగా మారతాయి. సవాళ్లను అధిగమించి, వాటిని ధైర్యంగా ఎదుర్కొని డబ్బును సంపాదిస్తారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
మకర రాశి
ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇది మంచి సమయం. పారిజాత యోగంవల్ల సొంత ఇంటిని కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి సంపద పెరగడానికి కారణమవుతాయి. ఈ రాశివారు ఈ సమయంలో రాజకీయాల్లో బాగా రాణిస్తారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications