శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో శనిదేవుడు న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. 12 రాశుల్లో శనిదేవుడు సంచారం చేయడానికి 30 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ప్రతి రాశిలోను రెండున్నర సంవత్సరాలుంటాడు. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శనిదేవుడు. రాశిచక్రాల్లో సంచారం చేసే సమయంలో ప్రత్యక్ష సంచారంతోపాటు తిరోగమన సంచారం కూడా ఉంటుంది.
జులై 13వ తేదీన శని మీనరాశిలో ప్రత్యక్ష సంచారం చేస్తాడు. నవంబరు 28వ తేదీ వరకు ప్రత్యక్ష సంచారం ఉంటుంది. ఈ ప్రభావం మూడు రాశులపై పడుతోంది. వారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఏయే రాశులకు ఈ విధమైన ప్రత్యక్ష సంచారం వల్ల బాగా కలిసిరాబోతోందనే విషయాన్ని తెలుసుకుందాం.

కర్కాటక రాశి
వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. వీరికి పెళ్లితోపాటు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును పొదుపు చేయాలి. మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి. అందుకు పెద్దల సలహా, కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. ప్రేమ జీవితం చాలా బాగుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు.
మకర రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ తిరిగి పూర్తవుతాయి. అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే అందరి నుంచి సహకారం పూర్తిగా అందుతుంది. అది మీ అదృష్టం అని చెప్పొచ్చు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి.
వృషభ రాశి
ఈ రాశివారి ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వేతనం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషంగా జీవిస్తారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి కలుగుతుంది. ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాటతీరు మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులను తెస్తుంది.












Click it and Unblock the Notifications