శనిదేవుడి అద్భుతమైన అనుగ్రహం.. ఈ రాశులు మిలియనీర్లు అవుతారు
నవ గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేయడం అనేది సంఘ జీవితాన్ని, మనుషుల వ్యక్తిగత జీవితాలను ప్రభావం చేస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని భగవానుడు. ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు.
మూడు దశాబ్దాల తర్వాత శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఏడాది పొడవునా ఒకే రాశిలో సంచారం చేస్తాడు. న్యాయదేవత అయిన శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఎవరు ఎంత నీతిగా, నిజాయితీగా ఉంటారో వారికి రెట్టింపు లాభాలను అనుగ్రహిస్తాడు. శని ప్రత్యక్ష సంచారం వల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

మకరం
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఎన్నడూ చేతికి రానంతరీతిలో ధనం అందుతుంది. దీనివల్ల రుణ సమస్యల నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. ఉన్నతస్థాయి జీవితం కోసం బాగా కష్టపడాలి. శనిదేవుడి అనుగ్రహం ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి.
వృషభం
సమస్యలన్నీ పరిష్కారం అవడంతోపాటు ఆర్థికంగా కలిసివస్తుంది. కొత్త అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. వాటిని ఉపయోగించుకుంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న ఇతర ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆస్తుల కొనుగోలుపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని, కుటుంబ సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కన్యారాశి
పొదుపు బాగా చేస్తారు. భవిష్యత్తులో ఉపయోగపడేలా చేయాలి. పెట్టుబడులు కూడా భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి. వ్యాపారాలు చేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. భాగస్వామితో వ్యాపారం చేయాలా? వద్దా? అనేది మీ గురువు సలహాతో అమలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారం మాత్రం బాగా అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications