మే నెలలో కోటీశ్వరులయ్యే రాశులు వీరే
జ్యోతిష్యం ప్రకారం మే నెల చాలా కీలకమైన నెలగా పండితులు పరిగణిస్తారు. ఈ నెలలో ఆరు గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. రాహువు, కేతువు, బృహస్పతి, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ప్రస్తుతం సంచారం చేస్తున్న రాశుల నుంచి వేరే రాశుల్లోకి ప్రవేశిస్తాయి. 7వ తేదీన బుధుడు మేషరాశిలోకి, 14వ తేదీన బృహస్పతి మిథునరాశిలోకి, 15వ తేదీన సూర్యభగవానుడు వృషభరాశిలోకి, 18వ తేదీన రాహువు-కేతువు సంచారం ఉంటాయి. ఈ పరిణామం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ మూడు రాశులకు మాత్రం అద్భుతమైన ప్రయోజనాలను కలిగించనుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
పెళ్లి కానివారికి పెళ్లవుతుంది. వివాహ ప్రతిపాదనలు చాలా వస్తాయి. మేథస్సుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ నెల ఈ రాశివారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో, కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనుకోకుండా ధనం లభిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తులతో అధిక పరిచయాలు ఏర్పడతాయి.

తులా రాశి
ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి కలిగి మతపరమైన కార్యక్రమాల్లో, సమాజ సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ పనిలోనైనా అదృష్టం తోడుండి చాలా సులువుగా విజయాన్ని అందుకుంటారు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో చాలా సులువుగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఈ నెల మొత్తం ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏ పనిలోను తొందరపడకుండా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారు.
వృషభ రాశి
ఆధ్యాత్మిక వాతావరణంపట్ల ఆసక్తి చూపిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు. అలాగే భవనాన్ని, వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ఈ నెల వీరికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సజావుగా పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications