వచ్చే నెల 16 వరకు ఈ రాశులకు సంపదనిచ్చేది వారి ఓర్పే
ఖగోళంలో గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం మిథునరాశిలో ఉన్న సూర్యుడు వచ్చే నెల 16వ తేదీ వరకు ఇక్కడే ఉంటాడు. ఈనెల 22వ తేదీన మృగశిర నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రానికి రాహువు అధిపతి. రాశి మార్చడంవల్ల మంచి, నక్షత్రాన్ని మార్చడంవల్ల మిశ్రమ ఫలితాలను సూర్యుడు కొన్ని రాశిచక్ర గుర్తులకు అందజేస్తున్నాడు. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
ఉద్యోగస్థులకు అనేక సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. పెట్టుబడుల విషయంలో కూడా ఎంతో ఆలోచించాలి. లేదంటే నష్టపోతారు. వ్యాపారాల్లో లాభాలు వచ్చేందుకు సమయం పడుతుంది. భాగస్వామిగా ఉండి వ్యాపారం చేయడం మానుకోవాలి. కోపం రాకుండా చూసుకోవాలి. మానసిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఆధారపడివుంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలున్నాయి. గొడవలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి
వ్యాపారాలకు సంబంధం ఉన్నవారు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం ఇది. ఇతరులకు డబ్బులివ్వడం మానుకోవాలి. లేదంటే అవి తిరిగిరావు. అలాగే ఆస్తికి సంబంధించిన విషయాల్లో సమస్యలున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులను నియంత్రించుకుంటే పెరిగిన ఆదాయాన్ని పొదుపు చేసుకోవడానికి వీలుపడుతుంది. చెడు పనులు చేసేవారికి, చెప్పుడు మాటలు చెప్పేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మీన రాశి
ఇప్పుడు చేస్తున్న పనుల్లో కొత్తగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల శత్రువులు కూడా పెరుగుతారు. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల ఫలితాలన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది. అలాగే ప్రేమ జీవితంలో కూడా సమస్యలున్నాయి. ఎంత ఓర్పుగా ఉంటే భవిష్యత్తులో అంత మంచి ఫలితాలను అందుకుంటారు. మిమ్మల్ని రక్షించేది మీ ఓర్పే అని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన మానుకోవాలి. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.












Click it and Unblock the Notifications