మీనరాశిలో శుక్రుడు... 2025లో ఈ రాశుల పంట పండింది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇది కాలానుగుణంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. శుక్రుడు సంపదకు, ప్రేమ, అందం, ఐశ్వర్యానికి ప్రతీక. 2025లో శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి శనిదేవుడు మకర రాశిలో ఉంటాడు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది చాలా పవిత్రమైన రాజయోగం. దీనివల్ల సంవత్సరం మొదట్లోనే ఏయే రాశులకు అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
దేవ గురువైన బృహస్పతి ఈ రాశికి అధిపతి. వీరికి అదనపు ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను ప్రస్తుతం అందుకుంటారు. కొత్త సంవత్సరం వీరికి బాగా కలిసిరానుంది. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడంతోపాటు వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు.

కర్కాటక రాశి
ఈ రాశివారు ఈ సమయంలో శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని శుభవార్తలను వింటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. భార్య తరఫు నుంచి ఆస్తి కలిసివచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. ఇప్పటివరకు పొదుపు చేసిన డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. వాహనాన్ని కూడా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. డబ్బును పొదుపు చేయడంపైనే మీ విజయం ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications