5 ఏళ్ల తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశులకు మహర్దశ పట్టుకుంది!
నవంబరు నెలలో కీలకమైన గ్రహాలు రాశి సంచారం చేస్తున్నాయి. అలాగే రెండు కీలక గ్రహాలు కలబోతున్నాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, గ్రహాల రాకుమారుడైన బుధుడి సంయోగం వల్ల శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు తమ జీవితంలో ఇంతవరకు పొందని అద్భుత ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ యోగం దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఏర్పడనుందని, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కుంభరాశి
ఈ రాశివారి 9వ స్థానంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. రాజయోగం వల్ల విదేశాల్లో పనిచేస్తున్నవారికి ముఖ్యంగా మంచి ఆర్థిక లాభాలున్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారు ఈ సమయంలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులపై ఒప్పందం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేయగులుగుతారు.

మకర రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల ఈ రాశివారి కెరీర్ ఊపందుకుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. దీంతోపాటు మంచి ఆర్డర్లు పొందుతారు. ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో మంచిపేరు రావడంతోపాటు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి స్థాయిని అందుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ పూర్తిచేస్తారు.
తులారాశి
పెళ్లి కానివారికి పెళ్లి జరుగుతుంది. చేసే ప్రతి పనిలోను, ప్రతి ప్రయత్నంలోను విజయాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. గౌరవాన్ని అందుకుంటారు. జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. భౌతిక సుఖాలను అనుభవిస్తారు.












Click it and Unblock the Notifications