జన్మాష్టమి నుంచి ఈ రాశులకు ధ్రువ యోగం.. పట్టిందల్లా బంగారమే
శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటేనే అందరి హృదయాలు పులకరిస్తాయి. భగవంతుడు మానవ జన్మ ఎత్తిన రోజు అది. 15వ తేదిన స్మార్త శ్రీకృష్ణాష్టమి, 16న శ్రీ వైష్ణవ శ్రీ జన్మాష్టమి జరుపుకుంటున్నాం. ఆరోజు మధ్యాహ్నం సూర్యుడు సింహరాశిలోకి, చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తారు. బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. దీనివల్ల ఉదయం 7.22 గంటల నుంచి ధ్రవ యోగం వస్తోంది. ఈ యోగం వల్ల ఏయే రాశులకు ఏవిధమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కన్యా రాశి
ప్రేమలో ఉన్నవారి జీవితం చాలా బాగుంటుంది. ఎటువంటి గొడవలు ఉండవు. రెండువైపులా కుటుంబాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్థులు పెద్ద విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. దీనివల్ల అనుకోకుండా డబ్బు చేతికి వస్తుంది. మంచి రంగంలో పెట్టుబడి పెట్టడంద్వారా దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది.

కుంభ రాశి
గతంలో మీరు వదిలేసుకున్న డబ్బులన్నీ చేతికి వస్తాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి పదోన్నతులు లభిస్తాయి. ఈ రాశివారు జన్మాష్టమి నుంచి చేసే ప్రతి పని కలిసివస్తుంది. ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. వారికి భారీ ఒప్పందం కుదురుతుంది. దీనివల్ల డబ్బులు వస్తాయి.
ధనుస్సు రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు. అనూహ్యంగా సంపద పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరతారు. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications