రోహిణీ నక్షత్రంలోకి బుధుడు... ఈ రాశుల పంట పండింది
గ్రహాల రాకుమారుడు బుధుడు ఎప్పటికప్పుడు తన రాశులతోపాటు నక్షత్రాలను కూడా మారుస్తుంటాడు. ఈనెల 28వ తేదీన బుధుడు రోహిణీ నక్షత్రంలోకి సంచారం చేశాడు. తెలివితేటలకు, మేథస్సుకు, తర్కానికి, జ్ఞానానికి కారకుడైన బుధుడి సంచారం కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుండగా మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బుధుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించడంవల్ల ఏయే రాశులు, ఏవిధంగా ప్రభావితమయ్యాయనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహ రాశి
వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలద్వారా వచ్చిన డబ్బును దుబారా చేసే అవకాశం ఉంది. అలా కాకుండా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడితే భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది. వాటిల్లో కూడా లాభాలుంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. ఉద్యోగస్థులకు కొత్త ఉద్యోగాల అవకాశాలు తలుపుతడతాయి. ఆర్థికంగా ఇబ్బందులుండవు. పరిస్థితి చాలా నిలకడగా ఉంటుంది.

మేష రాశి
దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు. ప్రేమ, శాంతి, సుఖసంతోషాలకు ఇది మంచి సమయం. ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒకరకంగా ఈ రాశివారికి ఎంతో శుభప్రదమని చెప్పొచ్చు.
మిథున రాశి
ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కెరీర్ కు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో మీ అనుబంధాలు బలపడతాయి.












Click it and Unblock the Notifications