ఆగస్టు 1 నుంచి ఈ రాశులకు అదృష్టం దరిద్రంలా పట్టుకుంటోంది!

ఆగస్టు 1వ తేదీన న్యాయదేవుడైన శని, సంపదకు కారణమయ్యే శుక్రుడు 90 డిగ్రీల కోణంలో కలుసుకోబోతున్నారు. దీనివల్ల ఎంతో శక్తివంతమైన కేంద్ర రాజయోగం ఏర్పడుతోంది. ఆరోజు నుంచి కొన్ని రాశులకు చెప్పలేనంత మేలు కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా వారికి సమాజంలో మంచి గుర్తింపు కలుగుతుందని తెలియజేస్తున్నారు. అత్యంత కీలక గ్రహాలైన శని, శుక్రుడివల్ల ఏర్పడుతున్న కేంద్ర రాజయోగంవల్ల ఏయే రాశులకు ఏవిధంగా లాభం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కుంభరాశి
ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు త్వరలోనే శుభవార్తలు వింటారు. జీవితం గౌరవప్రదంగా సాగుతుంటుంది. కుటుంబ సభ్యులంతా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శనిదేవుడిని, శుక్రుడిని పూజించడంవల్ల అనుకున్న పనులు కూడా శరవేగంగా పూర్తవుతాయి.

three zodiac signs will get amazing benefits and huge money due to Saturn and venus conjunction

మేషరాశి
పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. బాగా కష్టపడే తత్వం ఈ రాశివారికి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన అవసరంలేదు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చిన డబ్బును పెట్టుబడుల వైపు మళ్లిస్తారు.

మిథున రాశి
ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాన్ని కొంటారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. దీనివల్ల మంచి లాభాలు కలుగుతాయి. న్యాయ సంబంధిత కేసుల్లో తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి. ఇప్పటివరకు కుటుంబంలో నెలకున్న వివాదాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+