జనవరి చివరి వారం నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
సంపదకు, విలాసవంతమైన జీవితానికి, అందానికి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు ఈనెల చివరి వారంలో రాశిని మారుస్తున్నాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు ఈనెల 28వ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆరోజు నుంచి మే నెల 31వ తేదీ వరకు మీనరాశిలోనే పరిభ్రమణం చేస్తుంటాడు. ఈ సమయంలో మూడు రాశులవారికి మంచి అదృష్టం కలుగుతుంది. వారు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభం
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలున్నాయి. వాయిదా వేసుకుంటూ వస్తున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. దీనివల్ల మంచి లాభాలున్నాయి. డబ్బును ఇతర వ్యాపారాలపైకి మళ్లిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. అలాగే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడానికి అవకాశం ఉంది.

కర్కాటకం
వీరి కోరికలన్నీ ఈ సమయంలో తీరతాయి. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే ఇప్పుడు బాగా మెరుగవుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవడానికి అవకాశాలున్నాయి. అవి మీ ప్రయత్నంపై ఆధారపడివుంటాయి. అన్ని విషయాల్లో అదృష్టం కలిసివస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరియడంతోపాటు సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వస్తున్న అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకుంటే జీవితంలో పైకి వస్తారు.
మిథునం
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. అలాగే వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. పెట్టుబడిని ఇతర వ్యాపారాలపైకి మళ్లించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. చాలా సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. కోరికలన్నీ అదుపుచేసుకొని డబ్బును ఇతర మార్గాలవైపు మళ్లించాలి. దీనివల్ల భవిష్యత్తులో మంచి రాబడిని అందుకుంటారు. కీలక నిర్ణయం తీసుకునే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోను కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి.












Click it and Unblock the Notifications