మాలవ్య రాజయోగంతో ఈ రాశులకు అద్భుతమైన ధనయోగం

నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, అందానికి, విలాసవంతమైన జీవితానికి, ఆరోగ్యానికి కారకుడు. శుక్రుడు ఎప్పుడు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి సంచారం చేసినా అందరికీ కలిసివస్తుంది. అంతేకాదు.. ప్రత్యేకమైన యోగాలను కూడా శుక్రుడు ఏర్పరుస్తుంటాడు. కొత్త సంవత్సరంలో ఈనెల 28వ తేదీన శుక్రుడు రాశి సంచారం చేయనుండటంతో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల అన్ని రాశులకు కలిసివస్తున్నా, మూడు రాశులకు మాత్రం బాగా కలిసిరానుంది. ఏయే రాశులు మాలవ్య రాజయోగంతో మంచి యోగాన్ని పొందుతున్నారో తెలుసుకుందాం.

వృషభ రాశి
వ్యాపారస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. వీరు అద్భుత విజయాలను అందుకుంటారు. వీరి సంపద రెట్టింపు అవుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని పూజించాలి. జీవితం మొత్తం మారిపోతుంది. ఏ పని తలపెట్టినా విజయం అందుకుంటారు. చేసే ప్రతి మంచి పనికి రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ సద్దుమణుగుతాయి. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

three zodiac signs will get amezing benefits and huge money due to venus transit from january 28th

ధనుస్సు
కెరీర్ కు సంబంధించి ఈ రాశివారి జీవితంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్నాళ్లుగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. మానసిక సమస్యలతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నవారు వాటి బారి నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపదను జాగ్రత్తగా పొదుపు చేసుకుంటేనే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది.

కుంభ రాశి
మాలవ్య రాజయోగంవల్ల వీరి అదృష్టం తీవ్రస్థాయిలో రెట్టింపు అవుతుంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా సాగి సంపదను తెచ్చిపెడతాయి. ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యానికి పరిష్కారం దొరుకుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని, బృహస్పతిని పూజించాలి. ఎదుటివారి డబ్బు కోసం ఎదురుచూడకుండా భగవంతుణ్ని నమ్ముకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+