ఈ రాశులకు భారీ సంపదనిస్తున్న బృహస్పతి... నిలబెట్టుకోవడం మీమీదే ఉంది!

దేవతల గురువైన బృహస్పతి ఏడాదికోసారి తన రాశిని మారుస్తుంటాడు. 2024 మే ఒకటో తేదీన మేష రాశి నుంచి వృషభరాశిలోకి మారాడు. అలాగే 2025లో తన రాశిని మార్చుకుంటాడు. దీంతోపాటు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. కొన్ని రాశులవారు మాత్రం రాజయోగాన్ని అనుభవిస్తారు. రుణ సమస్యలు పరిష్కారం అవడంతోపాటు కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. బృహస్పతి అంటేనే సంపదకు, ఆధ్యాత్మికతకు, సమాజంలో గౌరవానికి, శ్రేయస్సుకు, సంతానానికి కారకుడు. ఆయన అనుగ్రహం వల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

కర్కాటక రాశి
బృహస్పతి రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించడంవల్ల వీరికి రాజయోగం కలుగుతోంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోవడంతోపాటు కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వాహనాన్ని కూడా కొంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బృహస్పతికి పూజలు జరిపిస్తే చాలా బాగుంటుంది.

three zodiac signs will get financial benefits and get huge money due to Jupiter will enter rohini nakshatram

ధనుస్సు రాశి
ఉద్యోగస్థులు తాము పనిచేస్తున్న ప్రాంతంలో తోటి ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి మంచి మద్దతు అందుకుంటారు. పనితీరుపై ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే యోచన చేస్తున్నారు. భాగస్వామిగా చేస్తున్న వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. జీవితంలో అనేక కొత్త విషయాలను నేర్చుకుంటారు. అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అనుకున్న పనులన్నీ చాలా సులువుగా గురుడి దయతో నెరవేరతాయి.

మిథున రాశి
ఆర్థికంగా మంచిస్థాయికి చేరుకుంటారు. అప్పుల బాధ నుంచి విముక్తి లభించి మనశ్శాంతిగా ఉంటారు. అలాగే ఆదాయం పెరిగి సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. పెద్దల ఆరోగ్యంతోపాటు మీ ఆరోగ్యం విషయంపట్ల కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+