మాలవ్య రాజయోగం... ఈ రాశుల పాలిట కల్పవృక్షం
నవగ్రహాలన్నీ రాశి సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలోనే కొన్ని గ్రహాలు తిరోగమన దిశలో కూడా ప్రయాణం చేస్తుంటాయి. ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి, సంపదకు, అందానికి కారకుడైన శుక్రుడు తిరోగమన దిశలో పయనించడంవల్ల కొన్ని రాశులవారికి బ్రహ్మాండంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఆ రాశులవారి జీవితాల్లో సంతోషం నెలకొనడంతోపాటు ప్రేమ, శ్రేయస్సు ఉంటాయి. వచ్చే నెల 23వ తేదీన శుక్రుడు రాశిని మార్చబోతున్నారు. హోలీ పండగ తర్వాత జరిగే ఈ మార్పువల్ల ఏర్పడే మాలవ్య రాజయోగం కొన్ని రాశులవారి జీవితాల్లో మంచి మార్పులు తీసుకురాబోతోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మిథున రాశి
వీరు ఏ పని తలపెట్టినా గొప్ప అవకాశాలను అందుకుంటారు. వీరి సంపాదన భారీగా పెరుగుతుంది. అందుకు అదృష్టం తోడుంటుంది. ఒకరకంగా వీరికి మంచిరోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపద పెరగడంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలు కూడా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.

మకర రాశి
మాలవ్య రాజయోగంవల్ల ఈ రాశివారు పలుమార్లు శుభవార్తలు వింటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలోనే పూర్తవుతాయి. సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వీరు ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు. ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. డబ్బు సంపాదనకు అవకాశాలు దొరుకుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొన్ని అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి మాలవ్య రాజయోగం ఊహించనిరీతిలో ప్రయోజనాలను కలిగించబోతోంది. అంతేకాకుండా వీరు కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. ఏ పని తలపెట్టినా వీరికి విజయం వెన్నంటే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు.












Click it and Unblock the Notifications