సెప్టెంబరు 15 నుంచి ఈ రాశుల తలరాత పూర్తిగా మారిపోతోంది

నవగ్రహాల్లో కీలకమైన గ్రహాలు శుక్రుడు, కేతువు. సంపదకు, విలాసాలకు, కళలకు శుక్రుడు కారకుడైతే, కేతువుకు ఛాయా గ్రహమని పేరు. రాహు, కేతు గ్రహాలు అనగానే అందరూ భయపడతారుకానీ అవి మంచికూడా చేస్తాయి. వచ్చే నెల 15వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటికే అదే రాశిలో కేతువు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు కలుసుకోవడంవల్ల కొన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో విజయాలు వస్తాయి. అంతేకాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
ఈ సమయంలో విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నవారి కోరికలు నెరవేరతాయి. ఊహించని ధనలాభం ఉంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. సమాజంలో గౌరవం కలగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ ఉంది. దీంతోపాటు వేతనం పెరుగుతుంది. వృత్తిపరమైన జీవితం చాలా మెరుగుపడుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు కేతువు, శుక్రుడిని పూజిస్తే అనుకున్న పనులు తొందరగా నెరవేరతాయి.

three zodiac signs will get good name in society and huge money due to venus and ketu conjunction in leo from September 15th

ధనుస్సు రాశి
ఈ సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు అద్భుతమైన పురోగతి ఉంది. సంపద పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. దైవభక్తి బాగా పెరుగుతుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఏ పని తలపెట్టినా సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయగలుగుతారు.

కర్కాటక రాశి
వ్యక్తిత్వం మొత్తం మారిపోతుంది. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో మంచిపేరు వస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇప్పటివరకు ఉన్న అనుబంధాలన్నీ బలపడతాయి. మాటతీరు ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. ఏ పనినైనా నెరవేర్చగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటారు. వ్యాపారంలో పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+