2025లో ఈ రాశుల ఎదుగుదల చూసి ఇతరులు కుళ్లుకొని చస్తారు
గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. శాస్త్రం కూడా అదే చెబుతోంది. నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు శుభ ఫలితాలను కలగజేస్తే, మరికొన్ని రాశులకు వారి కర్మలను బట్టి చెడు ఫలితాలను కలగజేస్తాయి.
దేవతలకు గురువైన బృహస్పతి అత్యంత పవిత్రమైన గ్రహం. ఏడాదికి ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ఆయన దయవల్ల సంపద కలగడంతోపాటు సంతానం కలుగుతుంది.. జీవితం ఆధ్యాత్మిక దిశవైపు నడుస్తుంది. అక్టోబరు 9వ తేదీ నుంచి వృషభరాశిలో తిరోగమన దిశలో పయనిస్తున్నారు. దీనిద్వారా లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

కన్యారాశి
బృహస్పతి తిరోగమన దిశలో ప్రయాణిస్తుండటంవల్ల అనేక అవకాశాలు వీరి తలుపు తడతాయి. వాటిని ఉపయోగించుకుంటే వీరిని మించిన అదృష్టవంతులు ఉండరు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ప్రేమలో ఉన్నవారు సఖ్యతగా ఉండటంతోపాటు పెద్దల నుంచి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటారు.
కుంభం
వ్యాపారస్తులు భారీ విజయాన్ని నమోదు చేస్తారు. కొత్త ఆర్డర్లు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. దీంతోపాటు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా గడుస్తుంది.
మేష రాశి
ఈ రాశివరికి డబ్బులకు ఎటువంటి లోటు ఉండదు. ఎందుకంటే గురువు మేషరాశి రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అనుకోకుండా ధనలాభం ఉంది. ఆర్థికంగా స్థిరపడతారు. కొంతకాలం నుంచి మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక పరిస్థితులన్నీ పరిష్కారమవుతాయి. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications