శని సంచారంలో మార్పులు.. ఈ రాశులకు కుబేర యోగం
చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం అని పేరు తెచ్చుకున్నాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. అలాగే నక్షత్ర సంచారం కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల మేషరాశితోపాటు మరికొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
తులా రాశి
ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ప్రమోషన్స్ ఉన్నాయి. వేతనాలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. వచ్చిన డబ్బును ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు పెట్టుబడి పెడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారికి కూడా ఇది మంచి సమయం. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని కొన్నిసార్లు ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండటం లేదంటే మౌనంగా ఉండటం వీరికి కలిసివస్తుంది.

ధనస్సు రాశి
కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుంచి ఈ రాశివారు బయటపడతారు. ఆరోగ్యం గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగుపడుతుంది. ఇదే వారికి ఐశ్వర్యం. ఆర్థిక సమస్యల నుంచి కూడా తప్పనిసరిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న పెండింగ్ పనులను వదిలించుకుంటున్నారు. కొత్తగా మొదలుపెట్టే పనులకు అదృష్టం తోడుండటంవల్ల సులువుగా అవుతాయి.
మేష రాశి
వీరికి అదృష్టం ఒక్కసారిగా పట్టుకుంటుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం అప్పులు తీరకపోయినా కొన్ని తీరతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అనుకోకుండా సంపద పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ప్రతి పనికి అదృష్టం కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications