భద్ర మహాపురుష రాజయోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
గ్రహాల రాకుమారుడు బుధుడు సెప్టెంబరు నెలలో కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి బంగారు రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. తెలివితేటలకు, తర్కానికి, లెక్కలకు, వ్యాపారానికి కారకుడైన బుధుడివల్ల ఏర్పడుతున్న ఈ యోగంవల్ల కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలను పొందబోతున్నారు. అనుకోకుండా ఆర్థిక లాభాలున్నాయి. వచ్చిన డబ్బును పెట్టుబడులవైపు మళ్లిస్తారు. అనుకున్న పనులన్నీ వెంటనే పూర్తిచేస్తారు. కుటుంబ జీవితం వల్ల గౌరవాన్ని పొందుతారు. ప్రత్యర్థులపై విజయం ఉంది. మీడియా, బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా కలిసివస్తుందని చెప్పొచ్చు. మీ మాటతీరు పూర్తిగా మారిపోతుంది.

ధనస్సు రాశి
వ్యాపారాల్లో మంచి వృద్ధి ఉంటుంది. వివిధ రంగాల్లో పనిచేసేవారు విజయాలు అందుకుంటారు. ఉద్యోగస్థులకు ఊహించనిరీతిలో ప్రమోషన్స్ ఉన్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త లక్ష్యాలను సాధిస్తారు. అందరి నుంచి మద్దతు లభిస్తుంది. పనుల్లో మెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి. బ్యాంకింగ్, అకౌంటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం కలిసివస్తుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి డబ్బులు డబుల్ అయి సంతోషాన్ని కల్పిస్తాయి.
మిథున రాశి
ఆస్తి పరంగా కలిసివస్తుంది. మంచి ప్రయోజనాలు కలుగుతాయి. భౌతిక సుఖాలు అనుభవిస్తారు. సంపద పెరుగుతుంది. సంతోషంగా జీవిస్తారు. సౌకర్యాలు పెరిగి సుఖంగా జీవిస్తారు. భారీ స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం బాగుంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. పెద్దల నుంచి ఆస్తి, డబ్బులు కలిసివస్తాయి.












Click it and Unblock the Notifications