12 ఏళ్ల తర్వాత ఈ రాశుల వారికి కుబేర యోగం
ఈ నెల 15వ తేదీన ఖగోళంలో మూడు గ్రహాలు కలుస్తున్నాయి. బుధుడు, గురుడు, సూర్యుడు కలసి సంయోగాన్ని ఏర్పరుస్తున్నారు. మిథునరాశిలో వీరి కలయిక ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి అరుదైన పరిణామం జరిగింది. అలాగే ఈ ఏడాదిలో అతి పెద్ద విశ్వయోగం కూడా మిథునరాశిలోనే ఏర్పడనుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. బుధాదిత్య, త్రిగ్రాహి, గురు ఆదిత్య రాజయోగాలు ఈనెల 15న ఏర్పడ్డాయి. వీటివల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభ రాశి
భార్య వైపు నుంచి సంబంధాలు బలపడతారు. అత్త, మామలతో అన్యోన్యంగా ఉంటారు. పెండింగ్ ప్రాజెక్టులను ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో ఉన్నవారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో భారీ మొత్తంలో డబ్బును పొందుతారు. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

సింహరాశి
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి విజయం వరిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తిచేస్తారు. సొంత వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం అద్భుతమని చెప్పొచ్చు. వేరేవారికి గతంలో ఇచ్చిన డబ్బులన్నీ చేతికి వస్తాయి. ఉద్యోగస్థులకు వేతనాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసి జీవితంలో విజయాన్ని అందుకుంటారు.
మకర రాశి
15వ తేదీ నుంచి వీరి జాతకం పూర్తిగా మారిపోయింది. ఏ పనిలోనైనా అద్బుత విజయాలు సాధిస్తారు. ప్రతి పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అడ్డంకులను చాలా తెలివిగా తొలగించుకుంటారు. వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా ఆర్థిక విజయం తథ్యం. ఆస్తి వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఈ సమయంలోనే కలుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications