27 ఏళ్ల తర్వాత శని అద్భుతం.. ఈ రాశులకు అఖండ ధనయోగం

న్యాయదేవుడైన శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలను ఇస్తాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అత్యంత నెమ్మదిగా రాశిని మార్చుకునే శని అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. అక్టోబరు 3వ తేదీన శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనికి బృహస్పతి అధిపతి. ఆ సమయానికి ఆయన కూడా అదే నక్షత్రంలో సంచార దశలో ఉంటాడు. శని, గురువు కలయిక 27 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. దీనివల్ల ఏయే రాశులవారికి అదృష్టం కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

తులారాశి
ఎంతో కఠినమైన పనులను కూడా చాలా సులభంగా పూర్తిచేసే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనువైన సమయం. ఆకస్మికంగా ధనలాభం ఉంది. ఉద్యోగాలు చేస్తున్నవారు అధిక ప్యాకేజీలతో కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ఈ రాశివారు అన్ని పనులు పూర్తిచేస్తారు.

three zodiac signs will get huge money due to Saturn will enter purvabhadra nakshatram

కుంభ రాశి
కొత్తగా ఇంటితోపాటు నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. మీ కల నెరవేరుతుంది. అక్టోబరు నుంచి ఈ రాశివారికి చెప్పలేనంత ప్రయోజనాలున్నాయి. వ్యాపారాలన్నీ లాభసాటిగా మారతాయి. కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు తలుపుతడతాయి. అంతేకాకుండా అద్భుతమైన లాభాలను సొంతం చేసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ పని తలపెట్టినా అద్భుతమైన లాభాలను సొంతం చేసుకుంటారు.

మిథున రాశి
ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. కార్యాలయాలతోపాటు వృత్తి, వ్యాపారాల్లో కూడా పెద్ద పెద్ద బాధ్యతలు చేపడతారు. ఉద్యోగస్థులు కార్యాలయాలను మారుస్తారు. పాత పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+