శుక్రుడు, శని కలయికతో ఈ రాశులకు అమోఘమైన ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు సంపదకు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. అతి త్వరలోనే శక్తివంతమైన ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. మీనరాశిలో జరిగే ఈ పరిణామం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనుంది. ఏయే రాశులకు ఈ కలయిక ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మీనరాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. సంబంధాలన్నీ మెరుగుపడతాయి. అందరితో అన్యోన్యంగా ఉంటారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామివైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుగోలుగా ఉంటారు. డబ్బును భారీ మొత్తంలో పొందుతారు. ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు. అందుకు అదృష్టం తోడుంటుంది.

మిథున రాశి
ఈ రాశిలో జన్మించినవారికి అదృష్టం కలిసివస్తుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా మారుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపుతారు. ఆలోచనలన్నీ అటువైపే సాగుతుంటాయి.
వృషభ రాశి
ఆర్థికంగా కొన్నాళ్ల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరడంతోపాటు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. పెట్టుబడుల నుంచి ఊహించనిరీతిలో లాభాలను అందుకుంటారు. కొంతకాలంగా చికాకు పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి, ఇప్పుడు పెట్టబోయే పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు.












Click it and Unblock the Notifications