రేపటి నుంచి ఈ రాశులు ఏనుగు కుంభస్థలాన్ని బద్ధలు కొడతారు
సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు 28వ తేదీన మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. మే 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. వాస్తవానికి శుక్రుడు ఒక్కోరాశిలో ఒక్కోనెల మాత్రమే ఉంటాడు. కానీ మీనరాశిలో మాత్రం ఈసారి నాలుగు నెలలు సంచారం చేయబోతున్నాడు. రాక్షస గురువుగా పరిగణించే శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ రాశి చక్ర గుర్తులకు జీవితంలో ఎటువంటి ఢోకా ఉండదు. వారంతా మంచి స్థాయికి చేరుకుంటారు. శుక్రుడు ఈ రాశిని మార్చడంవల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్య
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ధనలాభం ఉంది. వీరికి సమాజంలో హోదా పెరగడంతోపాటు గౌరవం లభిస్తుంది. పనిచేస్తున్న కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని పూజించడంవల్ల కోరుకున్నవన్నీ నెరవేరతాయి. అందుకు ఆయనమీద నమ్మకంతో పూజ చేయించుకోవాలి.

మిథునం
కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సులువుగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంది. ఉద్యోగులకు కాలం కలిసిరావడంతో ధనలాభం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారు ఈ సమయంలో గట్టిగా ప్రయత్నాలు చేయాలి. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇది మంచి సమయం.
కుంభం
వ్యాపారస్తులకు ఆదాయం బాగా పెరుగుతుంది. వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. మరికొందరికి మాత్రం ఆకస్మిక ధనలాభం ఉంది. ఇది కూడా మంచి చేస్తుంది. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్నీ సానుకూలంగా ఉంటాయి. వీరికి వేతనం పెరుగుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి లాభం, నష్టం అనేవి ఫిఫ్టీఫిఫ్టీగా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.












Click it and Unblock the Notifications