2025లో ఈ రాశులపై కనకవర్షం: శుక్రాచార్యులవారి జాతకానికి తిరుగులేదు
జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశులను మారుస్తుంటాయి. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాయి. ఇలా చేసినప్పుడు కొన్ని రాశులకు సానుకూలంగా, మరికొన్ని రాశులకు ప్రతికూలంగా పరిణామాలు ఏర్పడుతుంటాయి. అలాగే శక్తివంతమైన రాజయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. వచ్చే సంవత్సరం జనవరిలో శుక్రుడు కొన్ని గ్రహాలను కలవబోతున్నాడు. దీనివల్ల మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇది ఎంతో శక్తివంతమైన యోగం. దీనివల్ల ఆర్థికంగా బలపడటమే కాకుండా కెరీర్ లో ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఇదే సమయంలో కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. మాలవ్య రాజయోగంతో ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
శక్తివంతమైన మాలవ్య రాజయోగం రాజకీయ రంగంలోనివారికి మంచి విజయాలను కట్టబెడుతుంది. వీరు ఈ సమయంలో ఎవరితో వాదనలకు దిగకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సమయంలో ప్రారంభించే కొత్త పనులువల్ల అనేక లాభాలను పొందుతారు. వచ్చిన డబ్బును తిరిగి పెట్టుబడి వచ్చేలా చూసుకోవడంలోనే గొప్పదనం ఆధారపడివుంటుంది. అందుకు జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి.

కర్కాటక రాశి
ఈ రాశివారి ఆదాయంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇదే సమయంలో విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. ఎప్పటినుంచో వేధిస్తున్న మానసిక ఒత్తిడి నంచి బయటపడతారు. అదృష్టం రెట్టింపు అవడంవల్ల అన్ని పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం కచ్చితంగా వరిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
వ్యాపారస్తులకు బాగుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. కలిసివస్తాయి. పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసివస్తాయి. కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయికానీ వాటిగురించి భయపడాల్సిన అవసరంలేదు. వాటంతటవే పరిష్కారమవుతాయని పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications