ఒక్క 4 రోజులు ఆగండి.. ఈ రాశులవారే ముఖేష్ అంబానీలవుతారు

గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. గ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయదేవత. చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు 2025 మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2027 జూన్ మూడోతేదీ వరకు అక్కడే సంచారం చేస్తుంటాడు. శనిదేవుడు చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశిని మారుస్తుంటాడు. మీనరాశిలోకి శని రావడంవల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గౌరవాన్ని అందుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అందుకు మీరు కష్టపడాల్సి ఉంటుంది. తండ్రికి సేవ చేయడంవల్ల రాచరిక సుఖాలను అందుకుంటారు. తల్లిదండ్రులపై మీరు చూపే ప్రేమే మీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది.

three zodiac signs will get more benefits and huge money due to saturn enter pisces in 2025 march 29th

తులా రాశి
ఈ రాశివారికి ప్రత్యేక ప్రయోజనాలను శనిదేవుడు అందిస్తాడు. కొన్నాళ్ల నుంచి నడుస్తున్న కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా రాబోతోంది. శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రత్యర్థుల నుంచి, శత్రువుల నుంచి ఎటువంటి హాని ఉండదు. కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.

మకర రాశి
అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మధ్యలో చిక్కుకుపోయిన డబ్బు చేతికి అందే సమయం ఇదే. ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆత్మీయుల నుంచి మద్దతు లభించడంతోపాటు ఆర్థిక సహాయం అందుతుంది. తల్లి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. మీరు పెట్టే పెట్టుబడి అతి పెద్ద లాభాలను తీసుకువస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవకాశాలను వినియోగించుకొని వృద్ధిలోకి రావాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+