దీపావళి తర్వాత ఈ రాశులకు బిగ్ సర్‌ప్రైజ్
ఈరోజు అందరూ సంతోషంగా దీపావళిని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, నరకాసురుడిని సత్యభామ వధించినందుకు టపాసులు కాల్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రావణాసురుడి దహనాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా న్యాయదేవత, కర్మ ప్రదాత అయిన శనిదేవుడు తమ స్థానాన్ని మార్చుకుంటున్నాడు. అలాగే బుద్ధికి, తెలివితేటలకు కారకుడైన బృహస్పతి కూడా తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఇలా ఈ రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడంవల్ల కొన్ని రాశులవారి జీవితాలు మారిపోతున్నాయి. ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
శని, గురువు ప్రభావంతో ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందడంతోపాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. దీంతోపాటు వేతనం కూడా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో కొన్నాళ్లుగా వస్తున్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. పూర్తి అన్యోన్యతతో ఉంటారు. కుటుంబ సభ్యుల మద్య అనుబంధం బలపడుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తిచేయగలుగుతారు. అందుకు కొందరు వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. డబ్బును పొదుపు చేసుకోవడం మంచిది. భవిష్యత్తులో మంచి రాబడినిస్తుంది.

ధనస్సు
దీపావళి నుంచి ఈ రాశివారి సుడి తిరిగినట్లే. వీరు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఏ పని తలపెట్టినా విజయం సాధించడంతోపాటు ప్రతి పని పూర్తవడానికి వీరికి అదృష్టం తోడుంటుంది. ధన సంపాదనపట్ల వీరు ఆసక్తి కలిగివుంటారు. అనుకున్న పనులను సాధిస్తారు. డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టడానికి కొందరు తోడ్పడడతారు.
కుంభ రాశి
ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. ఇవి పూర్తవడంవల్ల అదృష్టం కలిసివస్తుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కల నెరవేరుతుంది. దీపావళి నుంచి వీరికి అదృష్టం తోడుంటుంది. ఒకరకంగా వీరికి తిరుగుండదు.












Click it and Unblock the Notifications