ఈ రాశులవారికి సంపదల ఖజానా రాసిచ్చిన దేవ గురువు
ఖగోళంలో గ్రహాల కదలికలు మానవుల వ్యక్తిగత జీవితాలతోపాటు సంఘ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దేవ గురువైన బృహస్పతి ఆశీస్సులు 2025లో కొన్ని రాశులవారికి బాగా కలిసిరాబోతోంది. ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకునే గురుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలోకి గురుడు రావడంవల్ల అంతా శుభప్రదమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా బృహస్పతి ప్రయోజనాలను కల్పించనున్నాడో తెలుసుకుందాం.
మిథున రాశి
సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. బాగా చదవాలని ఆశతో ఉన్నవారి కోరికలు నెరవేరతాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశాలు వస్తాయి. అదనపు ఆదాయానికి అవకాశాలు తలుపు తడతాయి. వాటిని ఉపయోగించుకోవాలి. కొత్తగా పెట్టుబడులు పెడతారు. అవి భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి. అలాగే డబ్బును పొదుపుచేయడం ఈ రాశివారు అలవాటు చేసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదముంది. పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వాటిని తిరస్కరించకూడదు.

వృషభ రాశి
ఆకస్మిక ధనలాభం ఉంది. దీనివల్ల వీరు ఎంతో సంతోషంతో జీవిస్తారు. ఆర్థికంగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. మీరు కంటున్న కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడి విజయాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవాలి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బృహస్పతిని పూజిస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది.
తులా రాశి
ఉద్యోగులు వారి కార్యాలయాల్లో విజయాలను అందుకుంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు లభించి వేతనాలు పెరుగుతాయి. ప్రాజెక్టుల్లో విజయాన్ని అందుకోవడానికి బాగా కష్టపడతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపట్ల అప్రమత్తత అవసరం. బృహస్పతి ఆశీస్సులు లభిస్తాయి.












Click it and Unblock the Notifications