రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని ప్రతికూల, కొన్ని సానుకూల పరిణామాలు సంభవిస్తాయి.న్యాయదేవుడైన శనిదేవుడు కుంభరాశిలో ఉదయించనున్నాడు. మార్చి 17న తెల్లవారుజామున 4:40 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. కష్టాలన్నీ దూరమవుతాయని, అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మిథునరాశి
అదృష్టం కలిసివస్తుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంపద వృద్ధి చెందుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు మంచి మార్గాల్లోనే పెట్టుబడి పెట్టాలి. కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. సంపద రావడంతో అప్పుల ఊబి నుంచి బయటపడతారు.

మేష రాశి
ఈ రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. అన్ని సమస్యల నుంచి బయట పడటంతోపాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. కోరికలన్నీ నెరవేరతాయి. ఆదాయం పెరుగుతుంది. సంతానం కలుగుతుంది. ఉద్యోగంలో పెను మార్పు చోటుచేసుకుంటుంది. దానికి కట్టుబడి ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో ప్రతిష్ట కలుగుతుంది.
సింహరాశి
వ్యాపారస్తులకు గతంలో ఎన్నడూ కలగని లాభాలు కలుగుతాయి. కెరీర్ లో మంచి స్థానానికి చేరుకుంటారు. దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. గతం నుంచి వేధిస్తున్న అనారోగ్యం నుంచి బయటపడతారు. కోర్టు కేసుల్లో విజయం సాధించడంవల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యత ఉంటుంది.












Click it and Unblock the Notifications