ఈ రాశులకు అఖండ సంపదనిస్తానని శుక్రుడి హామీ

తులారాశికి శుక్రుడు అధిపతి. ఈనెల 18వ తేదీన శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల మాలవీయ రాజయోగం ఏర్పడింది. ఇటువంటి రాజయోగాలు వ్యక్తుల జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. 18వ తేదీ నుంచి 28 రోజులపాటు శుక్రుడు ఈ రాశిలోనే ఉంటాడు. దీనివల్ల చేసే పనుల్లో మంచి విజయం సాధించడంతోపాటు కొందరికి సన్నిహితుల నుంచి ప్రేమ, సాన్నిహిత్యం పొందుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేస్తారు. మాలవీయ రాజయోగంవల్ల ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. రాజకీయాలకు దూరంగా ఉండాలి. అలాగే శత్రువుల కళ్లబడకుండా ఉంటే చాలా మంచిది. దంపతుల మధ్య అనుబంధం పెరుగుతుంది. కొంతకాలం కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువులు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారవేత్తలకు మంచి కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగం చేసేచోట పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది.

three zodiac signs will get more money due to venus transit in libra

ధనుస్సు రాశి
కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు తగ్గిపోతాయి. ఉద్యోగస్తులకు పనిచేస్తున్న ప్రాంతంలో మంచి గుర్తింపు లభించడంతోపాటు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. దాంపత్య జీవితం కోసం ఎదురుచూసేవారికి ఈ సమయంలోనే శుభవార్తను అందుకుంటారు. సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. వ్యాపారస్తులకు వారి వారి రంగాల్లో మంచి ఎదుగుదల ఉండటంతోపాటు కొత్త ఆర్డర్లు లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది.

తులారాశి
ఈ సమయంలో వ్యాపారం ప్రారంభిస్తే వారికి తిరుగుండదు. వధువులు వరుడి కోసం వెతికే పనుల్లో విజయం లభిస్తుంది. వివాహం జరుగుతుంది. రుణబాధల నుంచి బయటపడతారు. తులారాశివారికి ధనలాభం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలోనే విజయవంతంగా పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+