2025లో ఈ రాశులవారే కుబేరులు.. ఇచ్చిన మాట తప్పనన్న కుజుడు, బుధుడు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు, శ్రేయస్సుకు కారకుడు. అలాగే గ్రహాలకు రాకుమారుడు లాంటి బుధుడు తెలివితేటలకు కారకుడు. వచ్చే ఏడాది జనవరి నాలుగోతేదీన శుక్రుడు శతభిషా నక్షత్రంలోకి, అదేరోజు బుధుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారికి గోల్డెన్ పిరియడ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు పండితులు. రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం వహిస్తారని, అన్నివిధాలుగా కలిసివస్తుందని తెలియజేస్తున్నారు. ఆ రాశులవారి వివరాలను తెలుసుకుందాం.
వృశ్చికం
ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వారు కోరుకున్న కంపెనీలో దొరికే అవకాశం కనపడుతోంది. కొత్త ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. జీవితం సంతోషంగా గడుస్తుంది. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎక్కువ సమయం మౌనంగా ఉంటే మంచిది. వారితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడితే పనులన్నీ పూర్తవుతాయి.

కర్కాటక రాశి
వ్యాపారస్తులు ఊహించని రీతిలో లాభాలను అందుకోబోతున్నారు. గతంలో చేతికి రాకుండా ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రంగాల్లో వీరు అదృష్టం తోడుండటంవల్ల విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి సలహాతో చేసే పనుల్లో వీరికి కచ్చితంగా విజయం వరిస్తుంది.
ధనుస్సు
వీరి కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుంది. కొన్నాళ్ల నుంచి అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కెరీర్ పరంగా ఉద్యోగులకు ఉన్న ఒత్తిళ్లు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం బాగుంటుంది. భగవంతుడి ఆశీర్వాదం ఉండటంతో ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు.












Click it and Unblock the Notifications