అలా ఇలా కాదు.. కొత్త సంవత్సరంలో ఈ రాశులవారికి అదిరిపోతుంది
జ్యోతిష్యం ప్కారం రాహువు, కేతువు తిరోగమన దిశలోనే సంచరిస్తుంటాయి. ఇవి రాశిని మార్చడంతోపాటు నక్షత్రాన్ని కూడా మారుస్తుంటాయి. ప్రస్తుతం కన్యారాశిలో సంచారం చేస్తున్న కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రానికి భానుడు అధిపతి. మొత్తం 12 రాశులపై ఈ ప్రభావం ఉంటున్నప్పటికీ కొన్ని రాశులపై మాత్రం ప్రత్యేక ప్రభావం ఉంటుంది. 2025 ఫిబ్రవరి ఏడోతేదీ వరకు సూర్యుడి రాశి అయిన కన్యారాశిలో ఉండే కేతువు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారు? ఏవిధంగా వారికి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యక్తిత్వం మెరుగుపడి మంచి పేరు సంపాదించుకుంటారు. అదృష్టం తోడుండటంవల్ల ఆధ్యాత్మిక రంగంవైపు అడుగులు వేస్తారు. కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సంపదను కూడా పెంచుకుంటారు. వ్యాపారస్తులకు చాలా బాగుంది. కన్నతల్లి ఆరోగ్యం విషయంలో శుభవార్తను వింటారు. వృత్తితోపాటు ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి లాభాలున్నాయి.

కుంభ రాశి
ఉద్యోగ రీత్యా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. కుటుంబంలో కొన్నాళ్ల నుంచి నెలకొన్న సమస్యలన్నీ తొలగిపోవడంతోపాటు సంతోషం వెల్లివిరుస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. గతంలో ఆస్తికి సంబంధించి పెట్టిన పెట్టుబడి ఆర్థిక స్థితిని మార్చడంతోపాటు బలోపేతం చేస్తుంది. ఏడాది చివరి వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. సమస్యలు, వివాదాల నుంచి బయటకు వస్తారు.
ధనుస్సు రాశి
ఉద్యోగంలో పదోన్నతి రావడంతోపాటు వేతనం పెరుగుతుంది. దీనివల్ల రుణబాధలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉండటంవల్ల ఆర్థికంగా బలపడతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. డబ్బులకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొన్నాళ్ల నుంచి నడుస్తున్న న్యాయపరమైన విషయాల్లో కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుంది. వృత్తితోపాటు వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు సమస్యల నుంచి బయటపడి లాభాలను పొందుతారు.












Click it and Unblock the Notifications