కుంభరాశిలో మహాలక్ష్మీ యోగం.. ఈ రాశులకు ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సూర్యుడి నుంచి రెండో గ్రహమైన శుక్రుడు, నాలుగో గ్రహమైన అంగారకుడు సంచారం చేయబోతున్నాయి. తమ రాశులను వదిలిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. శనిదేవుడి రాశిలో ఈ కలయిక జరగనుండటంతో అరుదైన మహాలక్ష్మీ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
కుంభ రాశి
ఈ రాశిలోనే అంగారకుడు, శుక్రుడి కలయిక ఉండబోతోంది. దీనివల్ల కుంభరాశి జాతకులకు కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వివాహం కానివారికి పెళ్లి కుదురుతుంది. వివాహమైనవారికి వైవాహిక జీవితం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇదే సమయంలో సంపద వృద్ధి చెందుతుంది.

వృశ్చిక రాశి
ఈ రాశివారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ రావడంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారం వృద్ధి చెందడంతో లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. పెట్టే పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.
తులా రాశి
తులారాశివారి సమస్యలన్నీ తొలగిపోతాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. అప్పుల ఊబి నుంచి బయటకు రావడానికి కొన్ని పరిస్థితులు దోహదపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతోపాటు ఉద్యోగస్తులకు వారి కోరికలు నెరవేరతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications