50 ఏళ్ల తర్వాత ఈ రాశులకు వరమహాలక్ష్మి రాజయోగం!

ప్రతి శ్రావణ శుక్రవారం ఒక పర్వదినం లాంటిది. మహిళలు ఆరోజు మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. మూడో శుక్రవారాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. 8వ తేదీన వర మహాలక్ష్మి పండగ ఉంది. ఆ రోజు ఇంద్ర యోగం, సర్వార్థ సిద్ధి యోగం, సుకర్మ యోగం అనే మూడు యోగాలు ఐదు దశాబ్దాల తర్వాత ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశిచక్ర గుర్తులకు మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా ఉంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని, పండగ ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
కష్టాల నుంచి ఈ రాశివారు బయటపడటానికి ఇది ఎంతో అనువైన సమయం. విలాసవంతమైన జీవితం సొంతమవడంతోపాటు భారీ సంపద చేకూరుతుంది. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. పిల్లల నుంచి శుభవార్తను అందుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ప్రత్యేకంగా ఉండటంవల్ల జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

three zodiac signs will turn to common life to rich life due to vara Mahalakshmi rajayogam

కుంభ రాశి
వ్యాపారంలో విజయం సాధిస్తారు. మంచి లాభాలు వస్తాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులకు మళ్లిస్తారు. అయితే కొత్త వ్యాపారం ప్రారంభించే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. జీవితంలో సంతోషం వస్తుంది. మీ శ్రేయస్సును కోరేవారు ఎక్కువవుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. మహాలక్ష్మిని పూజించడంవల్ల అన్నిరకాల ఇబ్బందుల నుంచి బయటపడి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి
ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. గతంలో కంటే ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ లేనంత శ్రేయస్సు పొందుతారు. కుటుంబ సభ్యులంతా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. వర మహాలక్ష్మీ రాజయోగం వీరికి ఎనలేని అదృష్టాన్ని కల్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+