దసరా తర్వాత రోజు నుంచి ఈ రాశుల పంట పండింది!
అక్టోబరు రెండో తేదీన విజయదశమి పర్వదినం వచ్చింది. ఆ తర్వాత రోజు 3వ తేదీ నుంచి నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ నక్షత్రానికి దేవతల గురువైన బృహస్పతి అధిపతి. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు పూర్వాభాద్రలోకి రావడంవల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏయే రాశులకు ఎటువంటి శుభాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
స్నేహితుల నుంచి ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ పొందలేని ధనలాభాలను పొంది సంపదను పెంచుకుంటారు. స్నేహితులు అండగా నిలవడంవల్ల కొన్ని పనులు చేసి మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాదు.. ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభాలున్నాయి. పెట్టుబడులు పెట్టే సమయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

కుంభరాశి
సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అన్నీ సానుకూల ఫలితాలే ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయడంవల్ల అపారమైన సంపదను పొందుతారు. వ్యాపారాలు చాలా సక్రమంగా సాగుతాయి. వీరికి ఎప్పుడూ ప్రశంసలే దక్కుతాయి. అందరూ పొడుగుతారు. కొత్త పనులు ప్రారంభించినా అవి కూడా విజయవంతమవుతాయి.
మిథున రాశి
ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. చేసే ప్రతి పనిలోను సానుకూల ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కెరీర్ పరంగా వృద్ధిలోకి వస్తారు. శనిదేవుడి వల్ల అంతా మంచే జరుగుతుంది. చేపట్టే ప్రతిపనిలో అదృష్టం తోడుంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనిదేవుడికి పూజ చేస్తే అనుకున్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications